జోగులాంబ గద్వాల జిల్లా.. ఐజ పురపాలక పరిధిలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో.. ఓ కిరాణ దుకాణం దగ్ధమైంది.
కిరాణ షాపులో భారీగా ఎగిసిన మంటలు - jogulamba gadwal latest news
జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓ కిరాణ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు అప్రమత్తమై మంటలు అర్పేశారు.
కిరాణ షాపులో భారీగా ఎగిసిన మంటలు
ఐజ పట్టణం ఎస్సీ కాలనీలో మార్కు అనే వ్యక్తి గత కొన్ని ఏళ్లుగా కిరాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. దుకాణంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపులోనే ఉన్న మార్క్ వెంటనే అప్రమత్తమై బయటకి దూకేయటంతో ప్రమాదం తప్పింది. స్థానికులు అప్రమత్తమై మంటలు అర్పేశారు. ఈ ఘటనలో సుమారు లక్ష మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
ఇదీ చదవండి:బిడ్డల వైద్యం కోసం ఓ తండ్రి ఆవేదన.. దాతల సాయం కోసం అభ్యర్థన