యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పురపాలక పరిధిలోని రాయగిరిలో తాళం వేసిన ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగాయి. భారీగా పొగలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. మంటలార్పిన ఫైర్ సిబ్బంది - కిరాణా షాపులో అగ్నిప్రమాదం
ఓ కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని రాయగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
![కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. మంటలార్పిన ఫైర్ సిబ్బంది A fire accident in grocery store in rayagiri in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10798013-437-10798013-1614410714575.jpg)
కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం.. మంటలార్పిన ఫైర్ సిబ్బంది
సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పురపాలిక ఛైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, రూరల్ ఎస్సై సైదులు పరిశీలించారు.