Fire Accident: పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు - A fire accident news
09:49 September 17
పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్‌లో అగ్నిప్రమాదం (fire accident) సంభవించింది. స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాములో మంటలు చెలరేగాయి. గోదాము నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.... ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.
గోదాములో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాము పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. గోదాములోకి వెళ్లే మార్గం లేకపోవడంతో.. అధికారులు, స్థానికులు జేసీబీలతో గోడలు కూల్చివేశారు. అగ్ని ప్రమదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:AOB: ఏవోబీలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు