తెలంగాణ

telangana

ETV Bharat / crime

నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఇంజినీరింగ్​ విద్యార్థులు.. ప్రొఫెసర్​ మాట కూడా వినకుండా - తెలంగాణ నేర వార్తలు

Engineering students fight in Hanumakonda: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ శివారులో ప్రధాన రహదారిపై ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు రెచ్చిపోయారు. స్థానిక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఓ జూనియర్, సీనియర్‌ విద్యార్థులకు జరిగిన వివాదం గొడవకు దారి తీసింది. అటుగా వెళ్తున్న ప్రొఫెసర్‌ ఎంత నచ్చజెప్పిన విద్యార్థులు వినకుండా పోట్లాడుకున్నారు.

Engineering students fight
Engineering students fight

By

Published : Oct 23, 2022, 12:06 PM IST

Updated : Oct 23, 2022, 12:47 PM IST

నడిరోడ్డుపై రెచ్చిపోయిన ఇంజినీరింగ్​ విద్యార్థులు.. ప్రొఫెసర్​ మాట కూడా వినకుండా

Engineering students fight in Hanumakonda: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లాపూర్ శివారు బావుపేట క్రాస్ రోడ్ వద్ద మధ్య కరీంనగర్ - హనుమకొండ ప్రధాన రహదారిపై ఇంజినీరింగ్ చదువుతున్న జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య చేలరేగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానిక ఎస్సార్ విశ్వవిద్యాలయంలో జూనియర్, సీనియర్ విద్యార్థికి మధ్య జరిగిన వివాదం రెండు వర్గాల మధ్య పోరుకు దారి తీసింది.

అటువైపుగా వెళ్తున్న కళాశాల ప్రొఫెసర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ సాక్షిగా ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ప్రొఫెసర్ విద్యార్థులకు ఎంత నచ్చచెప్పిన వినకుండా వారి మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. విద్యార్థుల మధ్య ఘర్షణతో కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారిపై ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడడంతో ఈ విషయం హసన్​పర్తి పోలీసుల వరకు వెళ్లింది.

దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాల గుంపును చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్థులు ఘర్షణ పడ్డ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రుల కల సాకారం చేయాల్సిన విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 23, 2022, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details