A Female officer attempted suicide in Khammam: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు దేవాదాయ శాఖలో అధికారిగా పని చేస్తున్న ఓ మహిళను దూషించినందున మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధితురాలు, తోటి సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని దేవాదాయ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారి గ్రామీణ మండలం మారమ్మ గుడికి సంబంధించిన పాలకవర్గ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేశారు.
అధికార పార్టీ నాయకుడు బెదిరింపులు.. మహిళా ఆధికారి ఆత్మహత్యాయత్నం - samatha suicide case in khammam
A Female officer attempted suicide in Khammam: రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించిన కొందరి నాయకుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. వారు ఏమి చేసిన అడిగే వాళ్లు ఎవరు లేరనుకొని తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మరికొందరు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వ అధికారులపైనే మండిపడుతున్నారు. ఇలానే ఖమ్మం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మహిళా అధికారితో దురుసుగా మాట్లడారు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఖమ్మం జిల్లాలో మహిళా అధికారి ఆత్మహత్యాయత్నం
ఈ విషయంలో బీఆర్ఎస్ స్థానిక మండల అధ్యక్షుడు వేణు ఆమెకు ఫోన్ చేసి తమకు ఎందుకు చెప్పలేదని బెదిరించాడు. దీంతో పాటు ఆమెతో దురుసుగా మాట్లాడారు. ఆమె ఆ మాటలను తట్టుకోలేక మసస్తాపానికి గురై కార్యాలయంలోనే బీపీ మాత్రలు ఎక్కువగా మింగినట్లు చెప్పి అక్కడిక్కడే పడిపోయారు. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: