Father killed Daughter in Vanaparthi: కన్నబిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. కాస్త నలత చేస్తేనే వారు తట్టుకోలేరు. నయమయ్యేదాకా మామూలు మనుషులు కాలేరు. అలాంటిది ఓ తండ్రే పదిహేనేళ్ల కుమార్తెను గొడ్డలితో నరికి దారుణంగా చంపాడు. ఒకటికాదు..రెండు కాదు.. ఏకంగా ఎనిమిది సార్లు వేటువేశాడు.
తీవ్రంగా గాయపడిన బాలిక రక్తపుమడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. తాను వద్దని చెప్పినా వినకుండా ఒక అబ్బాయితో స్నేహంగా ఉండటమే ఆ తండ్రి ఆగ్రహానికి కారణమైంది. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పాతపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు రాజశేఖర్, సునీత, దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె గీత (15) పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గ్రామానికి చెందిన ఓ యువకుడితో బాలిక సన్నిహితంగా మెలగడాన్ని తండ్రి రాజశేఖర్ గుర్తించి పలుమార్లు మందలించాడు.