father beats daughter in Hyderabad : హైదరాబాద్‌లోని బోరబండ నివాసి బాసిత్ అలీఖాన్, మాసబ్‌ట్యాంక్ సమీప ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సనా ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ఆటోడ్రైవర్‌గా వచ్చే సంపాదన చాలక, ఇతర కారణాలతో బాసిత్ కొన్నాళ్లుగా పిల్లలపై విపరీతంగా కోప్పడటం, కొట్టడం చేస్తున్నాడు. శనివారం సాయంత్రం పనికి వెళ్లే సమయంలో మూడో కుమార్తె సకీనా ఫాతీమా(3) స్నానాల గదిలో ఆడుకుంటోంది. బయటకు రమ్మని తండ్రి పిలిస్తే వెళ్లలేదు. పట్టలేని కోపంతో గరిటెతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. అడ్డుకోబోయిన భార్యను నెట్టేశాడు. కిందపడి ఆమె స్పృహ తప్పింది. తర్వాత కుమార్తెను పైకెత్తి నేలకేసి కొట్టి బయటికెళ్లిపోయాడు.
father beats daughter : మూడేళ్ల కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి.. - father beats dauther in hyderabad news
father beats daughter in Hyderabad : ఓ తండ్రి తన మూడేళ్ల కుమార్తెపై క్రూరంగా ప్రవర్తించాడు. ఇష్టారీతిన కొట్టడంతో పాటు నేలకేసి విసిరికొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఇప్పుడా బాలిక ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని సైఫాబాద్ ఠాణా పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
![father beats daughter : మూడేళ్ల కుమార్తెను నేలకేసి కొట్టిన తండ్రి.. father beaten dauther](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16044166-145-16044166-1659929350542.jpg)
స్పృహ వచ్చాక చూసి కుమార్తె నిద్రపోతోందని తల్లి భావించింది. కొద్దిసేపటి తరువాత పాలు పట్టేందుకు లేపేందుకు యత్నించగా, శరీరం చల్లగా ఉండటం.. నోటి నుంచి నురగలు రావటంతో ఆందోళనకు గురై వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఉస్మానియాకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాసిత్ ఉస్మానియా వద్దకు వెళ్లి కుమార్తెను చూసి కూలబడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త బాసిత్‌పై కేసు నమోదు చేశారు. భర్త జైలుకెళితే తమ పరిస్థితి ఏంటని భార్య సనా ఫాతిమా కన్నీరుమున్నీరవుతోంది.