Father beating daughter: మూడేళ్ల కుమార్తెను ప్లాస్టిక్ తాడుతో చితకబాదిన తండ్రి.. ఇదీ కారణం - మూడేళ్ల చిన్నారిని చితక్కొట్టిన తండ్రి
17:55 September 20
మూడేళ్ల కుమార్తెను ప్లాస్టిక్ తాడుతో చితకబాదిన తండ్రి
అన్నం తినడం లేదని ఓ తండ్రి.. తన మూడేళ్ల కుమార్తెను ప్లాస్టిక్ తాడుతో చితక బాదాడు (father beating his daughter). ఈ ఘటన మెదక్ (medak) పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ (viral news) కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజు... మెదక్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వారికి శ్రీవల్లి, శ్రీ వర్ధన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా... నాగరాజు మూడేళ్ల కిందట వెన్నెల అనే మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి గగనశ్రీ అనే మూడేళ్ల కుమార్తె ఉంది.
కొంత కాలంగా నాగరాజు, వెన్నెలతో కలిసి వేరే ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి రెండో భార్య కుమార్తె గగనశ్రీ... అన్నం తినలేదు. ఎంతలా చెప్పినా చిన్నారి మొండికేయడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు.. ప్లాస్టిక్ తాడుతో చిన్నారిని చితక్కొట్టాడు. తన కళ్ల ముందరే కూతురును కొడుతున్నా తల్లి వెన్నెల ఏమి అనకపోవడం గమనార్హం. కాగా చిన్నారిని దండిస్తుండగా.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు డయల్ 100కు కాల్ చేసి చెప్పడంతో టౌన్ పోలీసులు... నాగరాజు, వెన్నెలను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కేసు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అన్నం తినకుండా సతాయించినందుకే చిన్నారిని కొట్టినట్టు నాగరాజు తెలిపాడని మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు.
ఇదీ చూడండి:NEPAL GANG: మరోసారి నేపాల్ గ్యాంగ్ హల్చల్.. పాత స్కెచ్‌తో కొత్తగా దోచేశారు