Police Beat a Farmer in Nellore : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన రైతు శ్రీనివాసులురెడ్డిని ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసుస్టేషన్‌కు పిలిపించి.. విచారణ పేరుతో ఎస్సై కరీముల్లా, కానిస్టేబుల్ మునీంద్ర మంగళవారం రాత్రి కొట్టారని, రైతు భార్య ఆత్మకూరు డీఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులురెడ్డి ఆసుపత్రిలో చేరారని బంధువులు తెలిపారు. శ్రీనివాసులురెడ్డికి, అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు మధ్య కొన్నేళ్లుగా భూవివాదం ఉంది. నెల్లూరు జేసీ కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే, తన పంటను వరికోత యంత్రంతో శ్రీనివాసులురెడ్డి కోస్తున్నట్లు వెంకటేశ్వర్లు పొదలకూరు ఎస్సై కరీముల్లాకు ఫిర్యాదు చేశారు.
Police Attacked a Farmer in Nellore : కానిస్టేబుల్ మునీంద్రను పంపించి శ్రీనివాసులురెడ్డిని స్టేషనుకు పిలిపించి విచారించామనీ, ఆయన్ను కొట్టలేదని ఎస్సై వివరణ ఇచ్చారు. రైతును పోలీసులు కొట్టలేదని ఆత్మకూరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. విచారణ తర్వాత శ్రీనివాసులురెడ్డిని ఓ కానిస్టేబుల్ గ్రామంలో వదిలి వచ్చారని సీఐ పేర్కొన్నారు.
పొలంలో ఉండగా పట్టుకెళ్లారు