Mulugu Farmer Suicide Attempt : వానాకాలం సాగు మొదలై నాట్లు వేసిన కూడా.. ఇంకా యాసంగి పంట కొనుగోళ్లు పూర్తి కాలేదు. నెలల తరబడి ధాన్యం కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ రైతులు అవస్థలు పడుతున్నారు. రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ములుగు జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
Mulugu Farmer Suicide Attempt : ధాన్యం బస్తా తగులబెట్టి.. రైతు ఆత్మహత్యాయత్నం - Mulugu Farmer Suicide Attempt
10:28 January 01
Mulugu Farmer Suicide Attempt : ధాన్యం బస్తా తగులబెట్టి.. రైతు ఆత్మహత్యాయత్నం
ధాన్యం తగులబెట్టి..
Farmer Suicide Attempt in Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం బోర్నర్సాపూర్లో సందీప్ అనే రైతు కొన్ని నెలల క్రితం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చాడు. రోజులు గడుస్తున్నా.. అధికారులు పంట కొనకపోవడం వల్ల మనస్తాపం చెందిన సందీప్ ధాన్యం బస్తాను తగులబెట్టాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కొనకపోతే చావే శరణం..
Paddy Procurement Issue in Telangana: కేంద్రంలో ఉన్న ఇతర రైతులు, సిబ్బంది గమనించి.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తవ్వకపోవడం వల్ల ఎంతో మంది రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పొలంలో వేసిన పంట కోసం వెళ్లాలా.. మరోవైపు కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి ఉన్న ధాన్యం ఎప్పుడు కొంటారోనని దాని వద్దకు వెళ్లాలో అర్థంగాక రైతులు గందరగోళంలో పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయచూపి యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు. లేకపోతే ఆత్మహత్యలే శరణమని వాపోతున్నారు.