తెలంగాణ

telangana

ETV Bharat / crime

'హెచ్​పీసీఎల్ గ్యాస్ కంపెనీపై చర్యలు తీసుకోండి' - హెచ్​పీసీఎల్ కంపెనీ పంట వివాదం

గ్యాస్​ పైప్​లైన్​ కోసం పంటను నేలపాలు చేశారంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకుని నష్ట పరిహారం కల్పించాలంటూ పోలీసులును ఆశ్రయించాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో జరిగింది.

hpcl gas company case
హెచ్​పీసీఎల్ గ్యాస్ కంపెనీపై కేసు

By

Published : Apr 18, 2021, 7:17 PM IST

హెచ్​పీసీఎల్ గ్యాస్ కంపెనీ.. చేతికొచ్చిన తమ పంటను నేలపాలు చేసిందని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాజమాన్యంపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్​ చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో జరిగిందీ ఘటన.

గోకులపాడు గ్రామానికి చెందిన వినోద్ తన ఐదెకరాలలో కందిని పండిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా నుంచి.. జిల్లాలోని చర్లపల్లి వరకు వేస్తున్న గ్యాస్ పైప్ లైన్ కోసం సంబంధిత అధికారులు జేసీబీతో పంట పొలాల్లోకి అడుగుపెట్టారు. విషయం తెలుసుకున్న వినోద్ అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నాడు. అప్పటికే ధ్వంసమైన పంటను చూసి ఆవేదన వ్యక్తం చేశాడు.

అనుమతి లేకుండా ఎలా వచ్చారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో.. వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంపెనీపై చట్టపరమైన చర్యలు చేపట్టి, పంట నష్టానికి పరిహారం కల్పించాలని వారిని కోరాడు.

ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసుల మృతి.. ఒకరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details