ఆర్థిక సమస్యలతో రైతు బలవన్మరణం చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. లింగంపేట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొడ్డాల పోచయ్య (50) వ్యవసాయం చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. సంవత్సరం కింద కొడుకు దుబాయ్ వెళ్లడంతో అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు పొలం సరిగ్గా పండకపోవడం, బోర్ ఎండిపోవటంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఉరి వేసుకుని మృతి చెందాడు.
ఆర్థిక సమస్యలతో రైతు మృతి - farmer suicide due to debts
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో జరిగింది.
ఉరి వేసుకొని రైతు ఆత్మహత్య
మృతునికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:సాగులో ఆధునికత తక్షణావసరం: మోదీ