Baby died in Nizamabad Hospital : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ బాబును కాకుండా మృత శిశువును అప్పగిస్తున్నారని బంధువులు ఆరోపించారు. బాన్సువాడకు చెందిన గర్భిణీ ఫాజియా బేగంను.. ఈనెల 21న రాత్రి ప్రసవం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. 22న ఉదయం బాబు పుట్టినట్టు సిబ్బంది సమాచారం ఇచ్చారు.
ఆస్పత్రిలో పసికందు మృతి.. కుటుంబం ఆందోళన.. చివరకు.. - ప్రభుత్వాసుపత్రిలో శిశువు మృతి
Baby died in Nizamabad Hospital : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందు మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ బాబును కాకుండా మృత శిశువును అప్పగిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు.
అయితే పుట్టిన బాబును కుటుంబ సభ్యులకు చూపించలేదని.. అర్ధరాత్రి వరకు బతిమాలినా సమాధానం ఇవ్వలేదని బంధువులు ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం బాబు చనిపోయాడంటూ వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. 36గంటల పాటు బాగానే ఉన్నాడంటూ చెప్పి ఇప్పుడు చనిపోయాడని అంటున్నారని.. తమ బాబును కాకుండా చనిపోయిన శిశువును ఇస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. చివరకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు మృత శిశువును మార్చురీకి తరలించేందుకు ఒప్పుకున్నారు.