తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆస్తి తగాదా: ఒంటరి మహిళపై బంధువుల దాడి - జంగిలిగొండలో మహిళపై బంధువులు. సర్పంచ్​ దాడి

అన్న ఆస్తిని తనకు తెలియకుండా గ్రామస్థులు.. మేనకోడలు పేరు మీద రాయించారనే కోపంతో ఆమెపై బంధువులతో కలిసి దాడి చేశారు. సర్పంచ్​ సహకారంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించాడు. గాయాలతో ఉన్న బాధితురాలు.. గ్రామస్థుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్​ జిల్లా జంగిలిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

jangiligonda
జంగిలిగొండ

By

Published : Feb 24, 2021, 7:39 AM IST

సర్పంచ్ ఇంట్లో పనికి వెళ్లకపోవడంతో కక్ష కట్టిన సర్పంచ్ ఆ మహిళ ఇంటిని కూల్చి వేయించి.. అడ్డు వచ్చిన గ్రామస్థులపై దాడి చేయించాడని ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కళమ్మ.. తన మేనమామ భిక్షం అనారోగ్యంతో మంచాన పడటంతో అతనికి సపర్యలు చేయసాగింది. ఇష్టం లేని భర్త.. ఆమెను వదిలేశాడు. కొంత కాలానికి భిక్షం మరణించాడు. గ్రామస్థులంతా కలిసి 170 గజాల స్థలంలో ఉన్న భిక్షం ఇంటిని కళమ్మ పేరు మీద రాసి తీర్మానం చేశారు.

సర్పంచ్​ సహకారంతో

దీంతో కళమ్మ చిన్న మేనమామ, అతని బంధువులు, కుమార్తెలు అందరూ కలిసి సర్పంచ్ సహకారంతో కళమ్మ ఇంటిపై దాడి చేశారు. ఇంటిని కూల్చేసి సామగ్రిని బయట పడేశారు. అడ్డుకోబోయిన గ్రామస్థులపై దాడి చేశారు. ఊరంతా ఆమె వైపే ఉండగా, కుటుంబ సభ్యులు ఇలా దాడి చేయడం విచారకరమని స్థానికులు వెల్లడించారు.

తన ఇంట్లో పని చేయడానికి రావడం లేదని కోపంతో ఉన్న సర్పంచ్​.. కళమ్మ చిన్నమామ కుటుంబీకులకు మద్దతునిచ్చి ఆమెపై దాడికి పాల్పడ్డారు. దాడిలో కళమ్మ ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు.. ఘర్షణకు కారణమైన సర్పంచ్ సాయిలు, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:రహదారిపై కారు బోల్తా.. అన్నదమ్ముల మృతి

ABOUT THE AUTHOR

...view details