bomb blast in Chittoor district : ఏపీలోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండల కేంద్రంలో నాటు బాంబు పేలి శునకం దుర్మరణం చెందింది. నాటు బాంబును కొరికిన శునకం.. ఘటనాస్థలంలో కుప్ప కూలి చనిపోయింది. నాటుబాంబును కొరకడంతో కుక్క తల ఛిద్రమైంది.
నాటుబాంబు పేలి.. శునకం మృతి - చిత్తూరు జిల్లాలో నాటు బాంబు కలకలం
bomb blast in Chittoor district : ఏపీలోని చిత్తూరు జిల్లాలో నాటు బాంబు కలకలం రేపింది. బాంబు పేలి శునకం మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు.
నాటుబాంబు పేలి.. శునకం మృతి
గురువారం రాత్రి జాతీయ రహదారి పక్కనే బస్టాండ్ వద్ద దుకాణాల సముదాయం నడుమ భారీ శబ్ధం రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. అనంతరం ఘటనాస్థలిని పరిశీలించి పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని ఆధారాలు సేకరిస్తున్నారు. నాటుబాంబు పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.
ఇదీ చదవండి..