A dispute arose between an NRI couple in Hyderabad: తరుణం నాజ్, శ్రీనివాస్ అనే వాళ్లు 2015 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో ప్రేమ వివాహం చేసుకొన్నారు. వారు యూఎస్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. తరచూ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె.. భర్తపై యూఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గొడవలు పెరిగాయి.
న్యూజిలాండ్‌లో పెళ్లి.. యూఎస్‌లో గొడవ.. ఇండియాలో..! - హైదరాబాద్ తాజా వార్తలు
A dispute arose between an NRI couple in Hyderabad: హైదరాబాద్‌లో ఎన్‌ఆర్‌ఐ దంపతుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదం దేశాలు దాటింది. యూఎస్‌లో ఉన్న భార్య, భారతదేశంలో ఉన్న భర్తపై కేసు నమోదు చేసింది. దీనిపై పోలీసు స్పందించి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... శ్రీనివాస్ తన కొడుకును చూసేందుకు వచ్చి.. భార్యకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇండియాకి తీసుకొచ్చాడు. కుమారుడు ఇంటి దగ్గర లేకపోడంతో ఆమె తన భర్తకు ఫోన్ చేయగా.. ఇండియాకు తీసుకొచ్చాడన్న విషయం చెప్పాడు. వెంటనే ఆమె హైదరాబాద్ సరూర్‌నగర్ మహిళా పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు... శ్రీనివాస్‌పై లుక్ అవుట్ నోటిసు ఇచ్చి 498 కేసు నమోదు చేశారు. కొత్తపేట కమలాపురి కాలనిలోి నివాసముంటున్న శ్రీనివాస్ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో అతని ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి: