భారీ వర్షాలకు పూడ్చిపెట్టిన మృతదేహం కొట్టుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోర సమీపంలోని కప్పల వాగులో వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది.
Dead body: వరద నీటికి కొట్టుకుపోయిన మృతదేహం - telangana news
భారీ వర్షాలకు పూడ్చిపెట్టిన మృతదేహం కొట్టుకుపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బెజ్జోర వాగు వద్దనున్న శ్మశానవాటికలో పూడ్చిన మృతదేహం వరద నీటికి కిలోమీటర్ కొట్టుకుపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
![Dead body: వరద నీటికి కొట్టుకుపోయిన మృతదేహం dead body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13223734-874-13223734-1633019687616.jpg)
dead body
కప్పలవాగు పక్కన స్మశాన వాటికలో పూడ్చిపెట్టిన మృతదేహం వరద నీటికి బయటకు కొట్టుకువచ్చి కిలోమీటరు దూరం వాగులోని నీటిలో తేలియాడుతూ కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు మళ్లీ అదే వాగులో దహనం చేశారు.
ఇదీ చదవండి:Suicide attempt at metro: మెట్రోస్టేషన్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. తీవ్రగాయాలు