తెలంగాణ

telangana

By

Published : Apr 24, 2022, 3:26 AM IST

ETV Bharat / crime

పెద్దపల్లి జిల్లాలో భారీ కుంభకోణం.. ఎఫ్​సీఐకి ఎగనామం పెట్టిన కేటుగాడు

custom rice milling scandal: పెద్దపల్లి జిల్లాలో భారీ కుంభకోణం బయటపడింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైస్ మిల్లుకు ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మిల్లు యజమాని బియ్యంను బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న వైనం బహిర్గతమైంది.

rice mill
లక్ష్మీనర్సింహ రైస్ మిల్లు

custom rice milling scandal: పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనర్సింహ రైస్ మిల్లులో కస్టమ్ రైస్ మిల్లింగ్ కుంభకోణం బయటపడింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైస్ మిల్లుకు ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇవ్వాలి. లెవీ పెట్టాల్సిన బియ్యంను మిల్లు యజమాని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న వైనం బహిర్గతమైంది. లెవీ బియ్యంపై ఫిర్యాదులు రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్​కు అప్పగించిన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్​కు పౌరసరఫరాల శాఖ 91,258 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించారు. రూ.5,95,98,278 విలువ గల 21,100 క్వింటాళ్ల బియ్యంను మాయం చేశారు.

మిల్లు యజమాని ఎఫ్​సీఐకి బియ్యాన్ని చెల్లించాల్సిన గడువు పూర్తయినప్పటికీ అప్పగించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గతంలోనే అధికారులు తనిఖీలు చేపట్టారు. బియ్యం అప్పగించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంలో మార్పు రాకపోవడంతో శనివారం సుల్తానాబాద్ పోలీస్​స్టేషన్​లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని మరిన్ని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తే పెద్దఎత్తున కుంభకోణాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details