ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల దారుణ హత్య - couple were killed in nalgonda district
నల్గొండలో దారుణం, నల్గొండలో దంపతుల హత్య, దంపతుల హత్య
07:18 April 19
భూవివాదాలతో దంపతుల దారుణ హత్య
నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం బుగ్గ తండాలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట నిద్రిస్తున్న దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతులు నేనావత్ సోమాని, బుల్లిగా గుర్తించారు. భూవివాదాలే దంపతుల హత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :ఈజిప్టు రైలు ప్రమాదంలో 11 మంది మృతి
Last Updated : Apr 19, 2021, 7:44 AM IST