Couple Romance at Tolet house: హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 'టూ లెట్' బోర్డు ఉన్న ఓ ఇంటి వద్దకు బైక్‌పై ఓ జంట వచ్చి ఆగింది. అప్పుడే పని మీద బయటికి వెళ్తున్నాడేమో ఆ ఇంటి ఓనరు.. స్కూటీ స్టార్ట్ చేస్తున్నారు. ఆయన వద్దకు వచ్చి.. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. బైక్‌పై వచ్చిన ఆ జంటను దంపతులుగా భావించిన ఆ యజమాని.. రెండో అంతస్తులో పోర్షన్ ఉందని చెప్పి చూసుకోమన్నారు. సరే వీళ్లు ఎలాగూ ఇల్లు చూడటానికి వచ్చారు కదా.. కాసేపాగి బయటకు వెళ్దామని అనుకున్నారు. ప్రతి ఒక్కరికీ దగ్గరుండి ఏం చూపిస్తాంలే అనుకున్నారో ఏమో.. బయటే స్కూటీ దగ్గర నిల్చున్నారు. దీంతో ఆ జంట ఇల్లు చూసేందుకు రెండో అంతస్తుకు వెళ్లింది. అంతలో క్షణాల్లోనే మళ్లీ కిందికి వచ్చారు. ఆ అమ్మాయి గేటు దగ్గర నించొని ఉంది.
ఆమెతో పాటు వచ్చిన యువకుడు.. బైక్‌ను ఓ పక్కగా పెట్టి.. ఓనర్‌కు ఏదో చెప్పి.. మళ్లీ ఆమెతో కలిసి పైకి వెళ్లాడు. గదిలోపలికి వెళ్లారు. తలుపు దగ్గరగా వేసుకున్నారు. అలా కొంత సమయం గడిచింది. అద్దె, మెయింటెన్స్ వివరాలు చెప్పి.. బయటకు వెళ్దామని చూస్తున్న ఇంటి ఓనరు.. వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంకాస్త సమయం గడిచింది. ఇంకా బయటకు రాలేదు. దీంతో సహనం కోల్పోయిన యజమాని.. వీళ్లేంటీ ఇంతసేపూ లోపలే ఉన్నారని ఆయన కూడా పైకి వెళ్లారు. తలుపు దగ్గరగా వేసి ఉంది. లైట్లు కూడా ఆఫ్ చేసి ఉన్నాయి. ఇదేంటి వీళ్లు చీకట్లో ఇల్లు ఏం చూస్తున్నారనుకొని తలుపుతీసి లోపలికి వెళ్లారు. అంతే ఒక్కసారిగా లోపల సన్నివేశాన్ని చూసి కంగు తిన్నారు. ఓనర్ పరిస్థితి ఇలా ఉంటే.. లోపల ఉన్న ఆ జంట దెబ్బకు బెంబేలెత్తిపోయి ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తారు. అక్కడ సన్నివేశాన్ని చూసి ఇంకా షాక్ నుంచి తేరుకోని ఆ ఇంటి యజమాని వాళ్లు పరిగెత్తుతుంటే అలాగే చూస్తుండిపోయారు. తీరా తేరుకొని వాళ్లను పట్టుకుందామని బయటకు వెళ్లేసరికి అప్పటికే బైక్‌పై పరారయ్యారు.
ఇంతకీ ఆ గదిలో ఏం జరిగింది..ఇల్లు చూస్తామని పైకి వెళ్లిన ఆ జంట.. లోపలికి వెళ్లి సరసాలు మొదలెట్టింది. మధ్యమధ్యలో ఎవరైనా వస్తున్నారేమోనని అతడు తలుపుతీసి బయటకు తొంగిచూస్తున్నాడు. ఆ యువతి ఇక ఎవరూ రారులే అని చెప్పినట్లుంది.. ఇక మనోడు తలుపు దగ్గరగా వేశాడు. ఇద్దరూ సరసాల్లో మునిగిపోయారు. ఇక మరో ప్రపంచంలో తేలుతున్నారు. ఇంతలో సడన్‌గా పానకంలో పుడకలా యజమాని రాకతో.. వారి రొమాన్స్‌కు బ్రేక్ పడింది. అంతే దొరికిపోయామనే భయంతో ఒక్కసారిగా నీరుగారిపోయారు. తప్పించుకునేందుకు ఆలోచిస్తున్నారు. మొత్తానికి ఎలాగోలా బయటపడ్డారు.
పాపం అలా దొరికిపోయారు:మొదటిసారి ఇల్లు చూడటానికి వెళ్లినప్పుడు అంతా తనిఖీ చేసుకున్నారేమో.. ఓనర్ పైకి రాడని నిర్ధరించుకున్నారేమో.. ఇదే సరైన స్పాట్ అని భావించినట్లున్నారు. బయట ఎక్కడా అనువైన చోటు దొరక్క.. పాపం సరసాలకు ఇద్దరూ మొహం వాచి ఉన్నట్లుగా.. 'టూ లెట్' ఉన్న ఇంటిని ఎంచుకున్నారు. అడ్డంగా బుక్కైపోయారు. తన కళ్లముందే ఇంత జరిగాక ఇంటి యజమాని ఊరుకుంటాడా మరి. ఇల్లు అద్దెకు కావాలని వచ్చి.. తన ఇంట్లోనే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారికి బుద్ధి చెప్పాలనుకున్నారు. వాళ్లిచ్చిన షాక్ నుంచి వెంటనే తేరుకోలేకపోయిన యజమాని.. అక్కడే పట్టుకోలేకపోయినా.. ఇంట్లో, బయటా సీసీ కెమెరాలు ఉండటంతో వారి పని పట్టాలనుకున్నారు. అంతే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆధారాలతో సహా ఆ యువజంటపై ఫిర్యాదు చేశారు.