Couple death: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాదెండ్ల మండలం గణపవరం అంబేడ్కర్ కాలనీలో గంటల వ్యవధిలోనే భార్యభర్తలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. అంబేడ్కర్ కాలనీకి చెందిన తాళ్లూరి అచ్చయ్య (60) చిలకలూరిపేట పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజీలో వాటర్ సర్వీసింగ్ పని చేస్తుంటాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన అనారోగ్యానికి (బ్రెయిన్ స్ట్రోక్) గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆయనను యడ్లపాడు ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు.
చికిత్స పొందుతూ అచ్చయ్య సోమవారం మృతి చెందాడు. భర్త మృతితో అతని భార్య చిట్టెమ్మ(55) తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త మృతి చెందిన గంటల వ్వవధిలోనే ఆమె కూడా కన్నుమూసింది. చిట్టెమ్మ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న అమె.. చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో భర్త మృతి చెందిన గంటల వ్యవధిలో చిట్టెమ్మ మృతి చెందటంతో కాలనీలో విషాదం అలుముకుంది. మృతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.