తెలంగాణ

telangana

ETV Bharat / crime

గన్​ పేలి కానిస్టేబుల్​కు తీవ్ర గాయాలు.. మిస్‌ ఫైరా..? ఆత్మహత్యాయత్నామా..? - తుపాకీ పేలి కానిస్టేబుల్​కు తీవ్ర గాయలు

Constable injured in Gun Misfire : కుమురుంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్‌ స్టేషన్‌లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న రజనీకుమార్ తుపాకీ పేలటంతో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయం కావటంతో అక్కడున్న సిబ్బంది అతణ్ని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Gun Blast Incident in Kautal Police Station
Gun Blast Incident in Kautal Police Station

By

Published : Nov 8, 2022, 12:14 PM IST

Constable injured in Gun Misfire : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్‌ స్టేషన్‌లో తుపాకీ పేలిన ఘటనలో కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. బెల్లంపల్లి పరిధిలోని బట్వాన్‌పల్లికి చెందిన సూర రజనీకుమార్ మంచిర్యాల జిల్లా గుడిపేట 13వ బెటాలియలన్​లో చేరారు. గత మే నుంచి అతను కౌటాల పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న అతను తుపాకీ పేలటంతో తీవ్రంగా గాయపడ్డాడు.

తుపాకీ పేలి కానిస్టేబుల్​కు తీవ్ర గాయలు..

Constable injured in Gun Misfire in Asifabad : తలకు తీవ్రగాయం కావటంతో గమనించిన సిబ్బంది కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ సురేశ్‌కుమార్, డీఎస్పీ కరుణాకర్ ఆస్పత్రికి చేరుకుని అతడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. తుపాకీ పేలిన ఘటనకు మిస్‌ఫైరా, లేదంటే కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details