వేగంగా వచ్చిన ఓ కారు.. అదుపుతప్పి బైక్ను ఢీ కొట్టిన ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
Accident: బైక్ను ఢీకొన్న కారు.. కానిస్టేబుల్ మృతి - రోడ్డు ప్రమాదంలో పోలీసు మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
car collided with bike
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ పోర్ట్ పీఎస్లో విధులు నిర్వహిస్తోన్న గుండేరావు.. స్నేహితుడి వివాహానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు వారు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:దారుణం: గొంతు కోసి తండ్రిని చంపిన కిరాతకుడు