ఏపీలోని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని కార్తికేయపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కార్తికేయపురం గ్రామానికి చెందిన సుకన్య.. 2014లో కానిస్టేబుల్‌గా ఎన్నికైంది. ఆత్మహత్యకు ముందు తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించింది. ఐదేళ్ల క్రితం గ్రామానికి చెందిన ప్రసాద్‌తో ఆమెకు వివాహమైంది.
సుకన్య - ప్రసాద్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. మొదటి పాపకు మూడేళ్లు గాగా.. రెండో పాప వయసు రెండు నెలలే. రెండో పాప పుట్టిన అనంతరం ఆపరేషన్ చేయించుకుని కార్తికేయపురంలోని అత్తగారి ఇంట్లోనే అంతా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంటికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడడం కలకలం సృష్టించింది.