తెలంగాణ

telangana

ETV Bharat / crime

Child_Death: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. నీలోఫర్​లో బాలుడు మృతి - ఆస్పత్రిలో బాలుడు మృతి

భాగ్యనగరంలోని నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో ఓ బాలుడు మృతి చెందాడు. నగరంలోని ఎర్రగడ్డకు చెందిన ఖాజా పాషా (4) ఆరోగ్యం విషమించడంతో మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

A child has died at Nilofer a children's hospital in Hyderabad
నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో బాలుడు మృతి

By

Published : Oct 31, 2021, 4:42 AM IST

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలుడు బలయ్యాడు. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందాడు. ఎర్రగడ్డకు చెందిన ఖాజా పాషా (4) అనే బాలుడు ఆరోగ్యం విషమించడంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు ఆస్పత్రి సిబ్బందిపై దాడి చేయడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న మజ్లిస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రిలో పని చేసే వార్డుబాయ్, వైద్యులు ఆక్సిజన్ పెట్టకుండా సీటీ స్కానింగ్ చేసేందుకు తీసుకెళ్లడంతో మార్గమధ్యలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వహించిన వార్డ్ బాయ్​తో పాటు వైద్యులపై చర్యలు తీసుకుని బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే భాషా ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి:

Selfie Suicide: భర్తకు వీడియోకాల్ చేసి ఉరేసుకుంది... ఎందుకంటే...

ABOUT THE AUTHOR

...view details