child died after drinking Pesticide : కుమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని భీంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగి.. శాన్వి అనే ఓ ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. గ్రామానికి చెందిన రాజేశ్-లావణ్య దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. ఐదేళ్ల శాన్వి.. ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. నిన్న ఆదివారం కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటి ఆవరణలోని ఓ బాటిల్లో ఉన్న పురుగుల మందును కూల్‌డ్రింక్ అనుకుని తాగేసింది.
కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారి.. 10 ఆస్పత్రులు తిప్పినా..! - child died after drinking Pesticide
child died after drinking Pesticide : అప్పటి వరకూ ఇంట్లోవాళ్లతో హాయిగా గడిపింది. పాఠశాలకు సెలవు కావడంతో కాసేపు ఆడుకుందామని బయటకు వెళ్లింది. అంతలోనే ఓ బాటిల్‌ను చూసి.. అందులో ఉన్న పానీయం కూల్‌డ్రింక్ అనుకుని తాగేసింది. అంతే.. ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు చేరింది. ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అనంతరం ఇంటికి వచ్చిన చిన్నారి.. వాంతులు చేసుకోవడం గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే కాగజ్‌నగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పట్టకపోవడంతో మంచిర్యాలకు వెళ్లారు. అక్కడా చిన్నారిని చేర్చుకోకపోవడంతో సుమారు మరో 10 ఆసుపత్రులు తిరిగారు. అయినా ఒక్కరూ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకోలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చూపించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి.. అంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి రోదనలు మిన్నంటాయి. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.