తెలంగాణ

telangana

ETV Bharat / crime

ట్విటర్​లో కూతతో.. వలస కార్మికులకు విముక్తి

A case on the owner of brick kiln: బతుకుదెరువు కోసం ఎక్కడినుంచో పొట్టచేత పట్టుకుని వచ్చిన కూలీలను వేధిస్తున్న యాజమానిపై కేసు నమోదైంది. ట్విటర్​ ద్వారా తెలంగాణ సీఐడీ అడిషనల్​ డీజీపీ మహేష్​ భగవత్​ దృష్టికి రావడంతో సదరు కూలీలకు యాజమాని చెర నుంచి విముక్తి లభించింది.

వలస కార్మికులకు విముక్తి
వలస కార్మికులకు విముక్తి

By

Published : Feb 7, 2023, 8:25 PM IST

A case on the owner of brick kiln: పని చేయించుకుని జీతాలివ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నఇటుక బట్టీ యజమానిపై కేసు నమోదు చేసి ఒడిశా కార్మికులకు విముక్తి కలిగించినట్టు మెదక్​ జిల్లా సీఐడీ అడిషనల్​ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇటుక బట్టీల నిర్వహకుడు తుమ్మ లక్ష్మీనారాయణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ఒడిశా నుంచి వారి సంబంధీకులు ట్విట్టర్​ ద్వారా తెలంగాణా సీఐడీ అడిషనల్​ డీజీపీ మహేష్​ భగవత్​ దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు.

మంగళవారం సాయంత్రం మెదక్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మెదక్ మండలం మాచవరం పరిధిలో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న మెదక్​ పట్టణానికి చెందిన తుమ్మ లక్ష్మీనారాయణ ఒడిశా నుంచి కార్మికులను తీసుకువచ్చి వారితో పనిచేయించుకుంటూ వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడన్నారు. అంతేగాక వారిని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వడం లేదన్నారు.

ఆయన ఆదేశాల మేరకు మంగళవారం తాము, లేబర్​ డిపార్ట్​మెంట్​, చైల్డ్​ వెల్ఫేర్​ ఆఫీసర్​లతో కలిసి మాచవరం సమీపంలోని ఇటుక బట్టీల వద్దకు చేరుకుని బాధిత కార్మికులను విచారించినట్టు తెలిపారు. సదరు ఇటుక బట్టీల నిర్వహకుడు వారితో పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతోపాటు, మానసికంగా వేధిస్తున్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు.

ఈ మేరకు బాధితులైన ఒడిశా కార్మికులు గల్వాల్​ రాణా, సురేంద్రి రాణా, ముకుంద రాణా, నిరు బదాయి, సుదమ్​ రాణా, ప్రకాశ్​ రాణాలకు విముక్తి కల్పించి, ప్రజ్వల స్వచ్చంద సంస్థ సహకారంతో వారిని సురక్షితంగా వారి ఒరిస్సాలోని స్వగ్రామాలకు తరలించినట్టు ఏఎస్పీ తెలిపారు. ఇటుక బట్టీల నిర్వాహకుడు లక్ష్మీనారాయణ మీద మెదక్​ రూరల్ పోలీస్​ స్టేషన్​ లో వివిధ సెక్షన్​ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.



ఈరోజు అడిషనల్ డీజీపీ మహేశ్​ భగవత్​ ఆదేశాల మేరకు లేబర్​ డిపార్ట్​మెంట్​, చైల్డ్​ వెల్ఫేర్​ ఆఫీసర్​లతో కలిసి మాచవరం సమీపంలోని ఇటుక బట్టీల వద్దకు చేరుకుని బాధిత కార్మికులను విచారించాము. సదరు ఇటుక బట్టీల నిర్వాహకుడు లక్ష్మీనారాయణ వారితో పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పాటు, మానసికంగా వేధిస్తున్నట్టు నిర్దారణ అయ్యింది. ఈ మేరకు బాధితులైన ఒరిస్సా కార్మికులకు విముక్తి కల్పించి లక్ష్మీనారాయణ మీద వివిధ సెక్షన్​ల కింద కేసు నమోదు చేశాము. - జి.వెంకటేశ్వర్లు, సీఐడీ అడిషనల్ ఎస్పీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details