Rape of Minor Girl in AP: బాలికపై అత్యచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చదువుకుంటున్న సమయంలో ఆ బాలికకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. స్నేహితుడిగా నటిస్తూ నమ్మించి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో బాలిక ఫిర్యాదు మేరకు నిందితుడైన యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
గుంటూరు జిలాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కొన్నేళ్ల క్రితం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఆ సమయంలో పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి బాలికతో యువకుడు స్నేహం చేశాడు. ఆ తరువాత ఒకరోజు బాలికను నమ్మించి పేరేచర్ల నగరవనం తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడు తీసుకున్న ఫొటోలను ఇటీవల ఆ యువకుడు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసాడు.