తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు - case on former minister Narayana
13:33 May 10
చంద్రబాబు, నారాయణపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై కేసు నమోదు నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్లోరాజధాని మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణతోపాటు... లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్‌పైనా కేసు పెట్టారు.
గత నెల 27న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయగా... నిన్న కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లతో పాటు అవినితి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదుచేసింది.
ఇదీ చూడండి: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్