ఏపీలోని గుంటూరు జిల్లా పిల్లుట్ల గ్రామానికి చెందిన వివాహిత పట్ల అదే గ్రామానికి చెందిన మల్ల గోపి అనే వాలంటీర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కోటయ్య తెలిపారు.
Sexual harassment: భర్త లేని సమయంలో వివాహిత ఇంట్లోకి వెళ్లి... - వాలంటీర్
ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు వాలంటీర్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా మాచవరం మండలంలో జరిగింది.
Sexual harassment
రెండు రోజుల క్రితం ఓ వివాహిత ఇంటికి, ఆమె భర్త లేని సమయంలో గోపి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మాచవరం ఎస్సై ఎస్.కోటయ్య తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితునిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ఇదీ చూడండి: పదేళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం- తండ్రి ఆత్మహత్య!