Warangal Road Accident Today: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. కుటుంబం బలి - ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు
![Warangal Road Accident Today: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. కుటుంబం బలి Warangal Road Accident Today: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16864939-8-16864939-1667870790034.jpg)
06:09 November 08
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
Warangal Road Accident Today: వరంగల్ జిల్లా వర్ధన్నపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. మరో ఆరుగురిని ఆసుపత్రి పాలు చేసింది. వరంగల్ నగరంలోని పెరికవాడకు చెందిన కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి కారులో ఒంగోలులో అయ్యప్పస్వాముల అన్నదాన కార్యక్రమానికి వెళ్లారు. తిరిగివచ్చే క్రమంలో తెల్లవారుజామున వర్ధన్నపేట సమీపంలోని డసీతండా వద్ద ఆగి ఉన్న లారీని వీరి కారు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కనున్న కల్వర్టు కిందకు కారు పడిపోయింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. జేసీబీ సాయంతో కారును బయటికి తీశారు. అప్పటికే కృష్ణారెడ్డితో పాటు ఆయన భార్య వరలక్ష్మి, కుమారుడు వెంకటసాయిరెడ్డి చనిపోయారు. కారులో ఉన్న వారి బంధువులు 6 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. వెంటనే అంబులెన్స్‌లో వారిని వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. దుర్ఘటనతో కృష్ణారెడ్డి నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.