తెలంగాణ

telangana

ETV Bharat / crime

bull died: కరెంట్ షాక్​తో ఎద్దు మృతి.. రైతు కుటుంబం కంటతడి - a bull died with current shock at mahabubabad district

మహబూబాబాద్ జిల్లా వస్రాం తండాలో రోజూలాగే ఉదయమే మేతకు వెళ్లిన ఓ ఎద్దు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

cow died with current shock at mahabubabad district
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి.. వెక్కి వెక్కి ఏడుస్తున్న బాధిత రైతులు

By

Published : Jun 8, 2021, 1:32 PM IST

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండాలో రైతు గుగులోత్ మంగ్యాకు చెందిన ఎద్దు మృత్యువాత పడింది. ఉదయం మేత కోసం వెళ్లిన మూగ జీవి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. సొంత పిల్లల్లా భావించి పెంచుకున్న ఎద్దు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

అందరూ ఎద్దు మృతదేహంపై పడి మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా అంటూ విలపించారు. ఈ దృశ్యం అందరినీ కలిచివేసింది. దీని విలువ సుమారు 70 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఎద్దు మృతితో తమ జీవానాధారం కోల్పోయామని... అధికారులే తమను ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు.

ఇదీ చదవండి:PRC: ఉద్యోగులకు గుడ్​న్యూస్​... అమల్లోకి రానున్న పీఆర్‌సీ!!

ABOUT THE AUTHOR

...view details