మేడ్చల్ పీఎస్ పరిధిలోని రాయిలాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు.. దుండిగల్ మండలం నాగూలూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ(45)గా పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు.. రాళ్లు, సీసాలతో అతని తలపై బలంగా కొట్టి... ఘటనా స్థలంలో పడేసి వెళ్లినట్లు వారు అనుమానిస్తున్నారు.
రాళ్లు, సీసాలతో కొట్టి.. దారుణంగా చంపేసి.. - మేడ్చల్ నేరాలు
మేడ్చల్ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. రహదారి పక్కనే.. మట్టి గుంతలో ఓ మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దారుణ హత్య
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం.. ఆధారాలు సేకరించింది. మృతదేహంతో పాటు అక్కడే ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత