మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో.. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎనుగొండకు చెందిన మిట్టే నరసింహులు(40)ను.. బంధువులు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీధర్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యపై స్థానికులను ఆరా తీశారు.
పట్టపగలే బండ రాళ్లతో మోది.. వ్యక్తి దారుణ హత్య - పట్టపగలే దారుణ హత్య
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. రోడ్డు పక్కనే ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రాళ్లతో మోది దారుణ హత్య
మృతుడు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంవత్సరం పాటు శిక్ష అనుభవించి.. ఇటీవలే జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:విషాదం: యువకుడి ప్రాణం తీసిన ఈత సరదా