విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడులో చోటుచేసుకుంది.
విద్యుదాఘాతంతో బాలుడు మృతి - విద్యుదాఘాతంతో బాలుడు మృతి
ఖమ్మం జిల్లా కొణిజర్లలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందాడు. అప్పటివరకు కళ్లముందే ఆటలాడుతూ తిరిగిన తమ కుమారుడు.. విగత జీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

boy was electrocuted to death
షేక్ నాగుల్ మీరా కుమారుడు జావీద్ (12) ఇంటి ముందు ఆడుకుంటోన్న సమయంలో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు కళ్లముందే తిరిగిన కుమారుడు.. ఒక్కసారిగా కుప్పకూలడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి.. కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి:కరోనాతో ఒకేరోజు తండ్రీకొడుకుల మృతి