తెలంగాణ

telangana

ETV Bharat / crime

Missing: బంధువుల ఇంటికి వెళ్తున్నానంటూ బాలుడు అదృశ్యం

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

boy went missing
boy went missing

By

Published : Jun 20, 2021, 10:54 PM IST

బంధువుల వద్దకు వెళ్తున్నానని చెప్పి బాలుడు అదృశ్యమైన ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో జరిగింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన రవీందర్ కుమారుడు శ్రీశాంత్(13) శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్త వద్దకు వెళ్తున్నానని ఇంటి యజమానికి చెప్పి వెళ్లిపోయాడు.

సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు విషయం తెలుసుకుని జోగిపేటలోని బంధువులకు ఫోన్ చేశారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:Wife Killed Husband: కూల్​డ్రింక్​లో ఎలుకల మందు కలిపి

ABOUT THE AUTHOR

...view details