సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని శాంతినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి సోహెల్ అనే బాలుడు మృతి చెందాడు. సోహెల్ తన స్నేహితుడు హాజీతో కలిసి స్థానికంగా ఉన్న సాకీ చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చెప్పు చెరువులో పడిపోయింది. ఆ చెప్పును బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు సోహెల్ చెరువులో పడి మునిగిపోయాడు.
కాలకృత్యాల కోసం వెళ్లి.. అనంతలోకాలకు చేరి..! - telangana latest news
కాలకృత్యాలు తీర్చుకునేందుకని స్నేహితుడితో కలిసి చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి చెప్పు ఒకటి చెరువులో పడిపోయింది. ఆ చెప్పును తీసేందుకు ప్రయత్నించి.. ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
చెరువులో పడి బాలుడి మృతి
గమనించిన హాజీ వెంటనే సోహెల్ తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: లిఫ్ట్ అడిగి.. పోలీసునని బెదిరించి బైక్ ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్