A Boy Died : ఐదేళ్ల బాలుడ్ని తల్లిదండ్రులు తమ వెంట పొలానికి తీసుకెళ్తున్న క్రమంలో తీవ్ర విషాదం జరిగింది. ఒక్కసారిగా ఆటో వచ్చి చిన్న పిల్లవాడిని ఢీ కొట్టడంతో మృతి చెందాడు. బాలుడి కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కోసిగి గ్రామానికి చెందిన రామాంజి, హనుమంతమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు కలరు. వీరు కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
అయితే తల్లిదండ్రులు ఇద్దరు పొలం పనుల కోసం పెద్ద కడబూరు మండలం బాపులదొడ్డికి ఆటోలో వెళ్లారు. వారితో పాటు అంజిని వెంట తీసుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఆటో దిగిన వీరు పొలంలోకి వెళ్తుండగా రోడ్డుపై వచ్చిన మరో ఆటో అంజిని ఢీ కొట్టింది. దీంతో బాలునికి తలకు తీవ్రగాయమైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు.