తెలంగాణ

telangana

ETV Bharat / crime

Boy Died: పల్లీలు తింటుండగా గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి - A boy died by stuck ground nut in throat

Boy Died while eating groundnut: అందరూ పండుగ పనుల్లో బిజీగా ఉన్నారు. అమ్మవారి గుళ్లో పండుగ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. కాసేపటికే ఆ ఇంట్లో సంతోషం మాయమైంది. తన అల్లరితో ఇంటిల్లిపాదికీ సంతోషాన్ని పంచిన కుమారుడు.. కళ్ల ముందే చనిపోవడం వారిని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది. నల్గొండ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Boy Died
పల్లీలు తింటూ బాలుడు మృతి

By

Published : Jan 17, 2022, 12:24 PM IST

Boy Died while eating groundnut: బంధువుల ఇంట్లో పండుగకు కుమారుడితో కలిసి వెళ్లిన ఆ దంపతులకు, కుటుంబీకులకు తీరని నష్టం వాటిల్లింది. పల్లీలు తింటుండగా అవి గొంతులో ఇరుక్కుని తమ రెండున్నరేళ్ల కుమారుడు మృతి చెందడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో చోటు చేసుకుంది.

చీకటిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు ఆదివారం బంగారు మైసమ్మ దేవాలయం వద్ద పండగ చేసేందుకు బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో నివసిస్తున్న శైలజ సోదరి రేణుక, ఆమె భర్త మల్లేశ్​, రెండున్నరేళ్ల వయసున్న వారి కుమారుడు అద్విత్‌ వచ్చారు. అందరూ పండగ ఏర్పాట్లలో నిమగ్నమవగా అద్విత్​.. వంటింట్లో ఉన్న పల్లీలను తీసుకుని ఒక్కసారిగా నోట్లో వేసుకున్నాడు. అవి శ్వాసనాళంలో ఇరుక్కోవడంతో బాలుడికి ఊపిరాడలేదు. గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఇదీ చదవండి:Farmer Death in Atmakur : పంటపై వానర మూకల దాడి.. ఆగిన అన్నదాత గుండె

ABOUT THE AUTHOR

...view details