సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో విషాదం చోటు చేసుకుంది. భీమా సిమెంట్ క్వారీలో స్నేహితులతో ఈతకు వెళ్లి వెంకటేశ్ అనే బాలుడు మృతి చెందాడు. నీటిలో ఒక్కసారిగా దూకడంతో లోతుకు వెళ్లి బయటకు రాలేక... నీళ్లలో చిక్కుకొని మృతి చెందాడని స్థానికులు తెలిపారు. నీటిలో దూకిన వెంకటేశ్ ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో స్నేహితులు కంగారుపడి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఈతకెళ్లి క్వారీ నీటిలో చిక్కుకొని.. బాలుడు మృతి - తెలంగాణ వార్తలు
స్నేహితులతో సరదాగా ఈతకెళ్లి ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. క్వారీలో ఈతకోసం దూకి నీటిలోనే మునిగిపోయాడు. అనుమానం వచ్చిన స్థానికులు గాలించగా మృతదేహం లభ్యమైంది. సూర్యాపేట జిల్లా రామాపురంలో ఈ విషాద ఘటన జరిగింది.
ఈతకొడుతూ బాలుడు మృతి, రామాపురం క్వారీలో బాలుడు మృతి
క్వారీలో గాలించి మృతదేహాన్ని వెలికి తీసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇదే క్వారీలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికులు తెలిపారు. మృతుడు వెంకటేశ్ పదో తరగతి చదువుతున్నాడు. కనీస రక్షణ చర్యలు లేవంటూ భీమా సిమెంట్ కార్యాలయం ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
ఇదీ చదవండి:కాలం చెల్లిన తినుబండారాలు విక్రయించే వ్యక్తి అరెస్ట్!