తెలంగాణ

telangana

ETV Bharat / crime

గోవా బీచ్​లో కలకలం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం - గోవా కలంగుటె బీచ్‌

గోవా కలంగుటె బీచ్‌లో ఓ యువతి మృతదేహం అర్ధనగ్నంగా లభ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. అయితే యువతి మృతిపై ఆమె కుటుంబీకులు, మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

Calangute beach
Calangute beach

By

Published : Aug 17, 2021, 3:07 PM IST

గోవా బీచ్‌లో ఈ నెల 12న అర్ధనగ్నంగా ఓ యువతి మృతదేహం లభ్యమైంది. సముద్రనీటిలో మునిగి ఆమె మరణించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే యువతి మృతిపై ఆమె కుటుంబీకులు, మహిళా సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే పోస్టుమార్టం నివేదికలో మాత్రం ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. ఆమెపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడి హతమార్చి ఉంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బీచ్‌లో యువతి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. మపుసా పోలీస్ స్టేషన్‌తో పాటు గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తులో పాల్గొంటారని తెలిపారు.

ఇదీ చూడండి:Gandhi Hospital Rape: 'గాంధీ'లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం... పోలీసుల అదుపులో నలుగురు

ABOUT THE AUTHOR

...view details