ఖమ్మంలోని రావిచెట్టు బజార్‌లోని వస్త్ర దుకాణంలోకి ద్విచక్ర వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనతో షాపులో ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి బండి దుకాణంలోకి పిడుగులా వచ్చి పడేసరికి ఏం జరిగిందో అర్థంగాక వారికి వెన్నులో వణుకుపుట్టింది. ప్రమాద సమయంలో దుకాణంలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి కూడా క్షేమంగా బయటపడ్డాడు.
బట్టల షాప్‌కెళ్లిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే?
ఓ వస్త్ర దుకాణంలో అందరూ తిరిగ్గా కూర్చోని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ పల్సర్ బైక్ దుకాణంలోకి దూసుకొచ్చింది. అక్కడ ఉన్నవాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో వారికి అర్ధం కాలేదు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Bike accident CCTV footage: బైక్ బ్రేకులు ఫెయిల్... వస్త్ర దుకాణంలోకి దూసుకెళ్లిన వాహనం
వాహనవేగానికి కౌంటర్‌ను ఢీ కొట్టి దుకాణంలో ఎగిరిపడ్డాడు. పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి:గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే..
Last Updated : Nov 10, 2021, 11:11 AM IST