కూలీ పని చేసుకుని పిల్లలతో ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా నందవరం మండలం మాచపురం నుంచి బోయ రాములు, లక్ష్మీ తమ ఇద్దరు కుమారులతో 10 రోజుల క్రితం బతుకుదెరువు కోసం పుల్లడిగుంటకు వచ్చారు. ఉదయం పనికి హాజరై.. ఇంటికి తిరిగి వెళ్తుండగా అతి వేగంగా దూసుకొచ్చిన లారీ.. వారి కుమారుడు తేజతమన్ (6)ను ఢీకొట్టింది.
కళ్లెదుటే కుమారుడి మరణం.. తల్లడిల్లిన కన్న హృదయం - andhrapradesh news
పొట్ట చేతపట్టుకుని కూలి పనుల కోసం వందల కిలోమీటర్లు దాటి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వచ్చిన ఓ కుటుంబానికి.. తీరని విషాదం మిగిలింది. కూలీ పని చేసుకుని పిల్లలతో ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొని బాలుడు మృతి చెందాడు. కళ్లెదుటనే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు. విగతజీవిగా పడి ఉన్న తమ్మున్ని చూసి అన్నయ్య బోరున విలపించాడు.
కళ్లెదుటే కుమారుడి మరణం.. తల్లడిల్లిన కన్న హృదయం
లారీ వెనుక చక్రాలు ఆ బాలుడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కుమారున్ని లారీ ఢీకొట్టం కళ్లెదుటనే చూసిన తల్లిదండ్రులు, తోటి కూలీలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకు పొలంలో ఆడుకున్న తమ్ముడు... విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోయిన చిన్నారి అన్నయ్య రోదన.. కంటతడి పెట్టించింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి... నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
- ఇదీ చూడండి: పోలీసులను తప్పుదారి పట్టించిన ఫార్మసీ విద్యార్థి