తెలంగాణ

telangana

ETV Bharat / crime

MINOR THIEF: వయసు 17 సంవత్సరాలే.. చోరీలు మాత్రం 48!

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో 17 ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా పద్దతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు.

THIEF
చోరీ

By

Published : Aug 22, 2021, 11:42 AM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ 17 ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్ హోంకు వెళ్లొచ్చినా పద్దతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు. శనివారం ఇంద్రపాలెం పోలీసు స్టేషన్​లో సీఐ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగి పగడాలపేటకు చెందిన మైనర్ 14 ఏళ్లకే దొంగతనాల బాటపట్టాడు. గతంలో కొన్ని కేసుల్లో జువైనల్ హోంకూ వెళ్లొచ్చాడు. బయటకు వచ్చి మళ్లీ ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు.

తాజాగా అగస్టు 8న తూరంగి ఏఎస్ఆర్ కాలనీలో మరికొందరితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. ఇందులోనూ ప్రధాన నిందితుడు ఈ బాలుడేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బాలుడితో పాటు రాయుడు గోపాలకృష్ణ(31), చాట్ల రమేశ్​ను(30) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు. వారి నుంచి రూ. 1,35,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:Love Fraud: ప్రేమ పేరుతో నగ్న చిత్రాలు సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు

ABOUT THE AUTHOR

...view details