ఏపీలో మహిళలు, చిన్నారులపై అత్యాాచారాల కేసులు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. వారితో అత్యధిక శాతం మంది బాధితులకు తెలిసిన వారే.. ఈ ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నవారిలో 99.4 శాతం మంది బాధితులకు తెలిసిన వారే ఉంటున్నారు. వీరిలో బాధితుల ఇరుగుపొరుగు వ్యక్తులు, ఆన్‌లైన్ వేదికల్లో పరిచయమైన స్నేహితులు కుటుంబ స్నేహితులు, ఉద్యోగమిచ్చిన యజమాని తదితరులే అధికం. చాలా మంది బాధితులు లైంగిక వేధింపులకు గురైనా ఎవరికీ చెప్పుకోలేక, తమలో తామే కుమిలిపోతున్నారు. కుటుంబసభ్యులే అఘాయిత్యాలకు పాల్పడినప్పుడు వారి గురించి ఇంట్లో చెప్పినా ఎవరూ నమ్మరేమోనని మరికొందరు బయటకు వెల్లడించడం లేదు. ఒకవేళ చెప్పినా కుటుంబ పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులూ బయటకు రాకుండా చేసేస్తున్నారు. దీంతో తామేం చేసినా బాధితులు ఎవరికి చెప్పరులే అనే ఉద్దేశంతో వారు దారుణాలకు ఒడిగడుతున్నారు.
1,088 కేసుల్లో తెలిసినవారే నిందితులు
- 2020లో ఏపీ రాష్ట్రంలో నమోదైన మొత్తం అత్యాచార కేసులు: 1,095
- తెలిసినవారే అత్యాచారానికి పాల్పడిన కేసులు: 1,088 (99.4 శాతం)