ganja seized in bhupalapalli : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండు కార్లలో తరలిస్తున్న 405 కిలలో ఎండుగంజాయిని ఘనపురం పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.80లక్షలు ఉంటుందని తెలిపారు. ఘనపురం మండలం గాంధీనగర్ క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు రెండు కార్లపై అనుమానమొచ్చి పరిశీలించగా.. గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్నవారిలో ఇద్దరు పరరవ్వగా ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ganja seized in bhupalapalli : రూ.80లక్షల విలువైన గంజాయి పట్టివేత - భూపాలపల్లిలో గంజాయి పట్టివేత
ganja seized in bhupalapalli : భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్ క్రాస్ వద్ద పెద్ద సంఖ్యలో గంజాయి పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న రూ.80 లక్షల విలువైన 405 కిలోల ఎండు గంజాయిని ఘనపురం పోలీసులు సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ గంజాయిని కొత్తగూడెం నుంచి భూపాలపల్లికి.. ఇక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామనికి చెందిన ఇద్దరు, చెల్పూర్, కొత్తగూడెం, భూపాలపల్లి నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు పరారయ్యాయని.. ముగ్గురు నిందితులను రెండు కార్లు, గంజాయిని సీజ్ చేసినట్లు జిల్లా ఇంఛార్జి ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గంజాయి ముఠాను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఆడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ సంపత్ కుమార్, ఎస్సైలు ఉదయ్, శ్రీకాంత్ రెడ్డి, చిట్యాల కృష్ణ ప్రసాద్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Bokkamanthulapadu knife attack : భార్యాభర్తల మధ్య గొడవ.. కళ్లలో కారం చల్లి.. కత్తులతో దాడులు!