తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja smuggling: చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి - పట్టుబడ్డ గంజాయి

7-crores-worth-ganja-caught-in-baradari-district
7-crores-worth-ganja-caught-in-baradari-district

By

Published : Jul 28, 2021, 4:50 PM IST

Updated : Jul 28, 2021, 7:53 PM IST

16:43 July 28

Ganja smuggling: చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి

చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి గుప్పుమంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో, ఖమ్మం గ్రామీణ పరిధిలో కలిపి మొత్తం రూ.9.28 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి పట్టణంలోని విద్యానగర్​ కాలనీ వద్ద పోలీసులు వాహనతనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటుగా రెండు చేపల లారీలు వచ్చాయి. వాటిపై పోలీసులకు అనుమానం రాగా... వెంటనే తనిఖీ చేశారు. లారీల నిండా చేపల పెట్టెలే ఉన్నాయి. కొన్నింటిని పరిశీలించగా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. నమ్మకం కుదరని పోలీసులు మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అసలు సరుకు బయటపడింది.

7 కోట్ల విలువైన గంజాయి..

రెండు లారీల్లో కలిపి మొత్తం 3,653 కేజీల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటన్నింటి విలువ ఏకంగా రూ.7 కోట్ల 30 లక్షల 62 వేలు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. రెండు లారీల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు కస్లే వెంకటేష్, కస్లే సుభాష్, ప్రశాంత్, నఫీజ్, ఇమ్రాన్ ఖాన్​లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ గంజాయి లారీలు... ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి బయలుదేరినట్టు నిందితులు తెలిపారు. రెండింటిలో ఒక లారీ హైదరాబాద్​కు... మరొక లారీని హరియాణాకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడ్డించారు. 

ఖమ్మం జిల్లాలో 730 కిలోలు స్వాధీనం..

మరో ఘటనలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం గ్రామీణ మండలం ఆరెంపుల వద్ద ఓ గోదాముపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ. కోటి 10 లక్షల విలువైన.. 730 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా... ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ విష్ణు వారియర్​ వెల్లడించారు. 

నిందితులంతా... ఉత్తరప్రదేశ్​కు చెందిన వారు కాగా.. ఖమ్మంకు చెందిన మరో ఇద్దరితో కలిసి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్టు పేర్కొన్నారు. ఈ దందాలో ఎంతమందికి సంబంధం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి రెండు డీసీఎంలు, రెండు బోలెరో వాహనాలు, రెండు స్కార్పియోలను సీజ్‌ చేశారు.

ఇదీ చూడండి:Rape case: మనవరాలిపై తాత అఘాయిత్యం.. గర్భం దాల్చిన బాలిక

Last Updated : Jul 28, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details