భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెండింగ్ చలానాలతో తిరుగుతున్న ఓ యువకుడి ద్విచక్రవాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ సురేశ్ తన సిబ్బందితో పాత కూరగాయల మార్కెట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా… ఓ మోటార్ సైకిల్‌ను నడుపుకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న బండిని చాసిస్ ఆధారంగా చెక్ చేయగా… 61 చలాన్లు, రూ. 15,535 పెండింగ్‌లో ఉన్నట్లు తేలగా పోలీసులు షాక్ అయ్యారు.
పెండింగ్ లో 61 చలాన్లు... యువకుడిపై కేసు నమోదు - Bhadrachalam bike challan pending
లాక్ డౌన్ లో భాగంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఓ ద్విచక్రవాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు చూసి అవాక్కయ్యారు. సదురు బైక్ పై ఏకంగా 61 చలాన్లు ఉన్నాయి. పోలీసులు బండిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
![పెండింగ్ లో 61 చలాన్లు... యువకుడిపై కేసు నమోదు bike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:51:44:1621934504-tg-kmm-06-25-61chalanas-pending-av-ts10042-25052021143141-2505f-1621933301-631.jpg)
bike
యువకుడి పేరు గుడిపల్లి నిఖిలేశ్ అని… రాజీవనగర్ కాలనీకి చెందినవాడుగా తెలిపారు. చలాన్లు చెల్లించకుండా… నంబర్ ప్లేట్లు తీసివేసి తిరుగుతున్నందున కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.