మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం నెలకొంది. హనుమాన్ బస్తీకి చెందిన గుండా హర్షిణి(6) విద్యుదాఘాతంతో మృతి చెందింది. గుండరాజు స్రవంతిల పెద్ద కూతురు హర్షిణి. ఎప్పటిలాగే మేనత్త ఇంట్లో ఆడుకోడానికి వెళ్లింది. ఇంట్లో ఉన్న ఇనుప కూలర్లో నీళ్లు పోస్తుండగా... హర్షిణి పట్టుకుంది.
ఆరేళ్ల చిన్నారిని మింగేసిన ఇనుపకూలర్... - bellampally latest news
ఇంట్లో నిత్యం నవ్వుతూ వుండే చిన్నారిని ఇనుప కూలర్ రూపంలో వచ్చిన మృత్యువు మింగేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు కన్నీటిని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన... మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని జరిగింది.
ఆరేళ్ల చిన్నారిని మింగేసిన ఇనుపకూలర్...
ప్రమాదవశాత్తు చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు... హర్షిణి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు మృతి చెందడం వల్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.