అక్రమ బంగారం సరఫరాకు(Gold smuggling in hyderabad airport) శంషాబాద్ విమానాశ్రయం అడ్డాగా మారుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా రాష్ట్రంలోకి బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆరు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లైట్లలో బంగారం తరలిస్తూ అధికారులను బురిడీ కొట్టించేందుకు ప్రయాణికుడు విఫలయత్నం చేశారు. చివరకు అధికారులు చాకచక్యంగా వ్యవహరించడంతో.. బండారం బయటపడింది.
Gold smuggling in hyderabad airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 6 కిలోల బంగారం పట్టివేత - తెలంగాణ వార్తలు
16:17 October 19
ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లైట్‌లో బంగారం తరలిస్తున్నట్లు గుర్తింపు
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీ(Gold smuggling in hyderabad airport) చేయగా... అతడి లగేజిలో రీఛార్జిబుల్ ఎమర్జెన్స్ లైట్లను గుర్తించారు. వాటిల్లో బంగారాన్ని దాచి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆరు కిలోలకుపైగా బంగారాన్ని లైట్లలో ఉంచి తీసుకొచ్చినట్లు శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. దీని విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఇదే తొలిసారి..!
బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వ్యక్తి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని అధికారులు తేల్చారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ప్రయాణికుడికి దుబాయ్‌లో బంగారం ఎవరు ఇచ్చారు..? దానిని హైదరాబాద్‌లో ఎవరికి అందజేయాలని చెప్పారు..? తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుడికి డబ్బు ఆశ చూపి లైట్లను ఇచ్చి పంపించి ఉండొచ్చని కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు.
రూ.34.24 లక్షల బంగారం పట్టివేత
ఇటీవలె ఈ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది(gold smuggling in hyderabad airport). కువైట్ ప్రయాణికుడి నుంచి రూ.34.24 లక్షల విలువైన 763.66గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం(gold seized in shamshabad airport) చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో నిర్వహించిన తనిఖీల్లో... బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వ్యక్తి చాక్లెట్ డబ్బాలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు(gold smuggling in hyderabad airport) తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:chigurupati jayaram murder case: చిగురుపాటి జయరామ్ హత్య కేసులో బెదిరింపులు.. ముగ్గురు అరెస్టు